News April 12, 2025
హైస్కూల్ ప్లస్లలో ఇంటర్పై కీలక నిర్ణయం

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్లలో ఇంటర్ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.
Similar News
News October 24, 2025
ఎంపీ vs ఎమ్మెల్యే.. కారణం ఇదేనా?

AP: విజయవాడ MP చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదం ముదురుతోంది. కొలికపూడి గెలుపు కోసం ₹18 కోట్లు ఖర్చు చేశానని, వచ్చే ఎన్నికల్లో TDP నేత జవహర్ కొడుకు పోటీ చేస్తారని చిన్ని చెప్పడమే గొడవకు కారణమని తెలుస్తోంది. ఆత్మగౌరవానికి భంగం కలగడంతోనే <<18082832>>ఇలా మాట్లాడాల్సి<<>> వస్తోందని MLA చెప్తున్నారు. 12 నెలలుగా దేవుడని, ఇప్పుడు దెయ్యమని ఎందుకంటున్నారో చెప్పాలని చిన్ని ప్రశ్నిస్తున్నారు.
News October 24, 2025
రాష్ట్రంలో 1,743 పోస్టులు.. అప్లై చేశారా?

TGSRTCలో 1,743 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే(OCT 28) సమయం ఉంది. ఇందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు 22-35 ఏళ్లు, శ్రామిక్ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. https://www.tgprb.in/
News October 24, 2025
ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవాళ షెడ్యూల్!

TG: ఇంటర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 23 నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.


