News February 24, 2025

సచివాలయ ఉద్యోగులపై కీలక నిర్ణయం

image

AP: రిజిస్ట్రేషన్ల శాఖలో ఖాళీలను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో భర్తీ చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను రద్దు చేసి రిజిస్ట్రేషన్ల శాఖ మనుగడకు చేయూతనిచ్చామన్నారు. జనాభా ప్రాతిపదికన సచివాలయాల సిబ్బందిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News February 24, 2025

SVSCలో పెద్దోడు, చిన్నోడు పేర్లివే!

image

టాలీవుడ్‌ బెస్ట్ క్లాసిక్‌లలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్, మహేశ్‌బాబుల క్యారెక్టర్ల పేర్లు రివీల్ అయినట్లు తెలుస్తోంది. పెద్దోడు, చిన్నోడు క్యారెక్టర్లకు పెట్టిన పేర్లివే. పెద్దోడు సిరి మల్లికార్జునరావు, చిన్నోడు సీతారామ రాజు అని IMDలో పేర్కొన్నారు. దీనిని ఇరు హీరోల ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

News February 24, 2025

YCPకి ప్రతిపక్ష హోదా రాదు: Dy.CM పవన్

image

AP: ‘ఈ ఐదేళ్లలో YCPకి ప్రతిపక్ష హోదా రాదు.. ఇది గుర్తుపెట్టుకోవాలి’ అని Dy.CM పవన్ తేల్చిచెప్పారు. 11 సీట్లు ఉన్న YCPకి ఆ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లాలంటూ ఎద్దేవా చేశారు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే ప్రసంగాలను అడ్డుకుంటామనడం సరైన పద్ధతి కాదని చెప్పారు.

News February 24, 2025

28న రాష్ట్ర బడ్జెట్

image

AP: ఈ నెల 28న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 19లోపు బడ్జెట్ ప్రక్రియ ముగుస్తుందని బీఏసీ మీటింగ్‌లో నేతలు అంచనా వేశారు. అవసరమైతే మరో రెండు రోజులు (మార్చి 20, 21) పొడిగించుకునేలా షెడ్యూల్‌ రూపొందించారు.

error: Content is protected !!