News August 6, 2025
క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

AP: క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 15 నుంచి RTC బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాఖీ బహుమతిగా ఈ పథకాన్ని అందివ్వనుంది. కొత్త బార్ పాలసీని క్యాబినెట్ ఆమోదించింది. కల్లుగీత కార్మికులకు 10శాతం షాపులు కేటాయించనుంది. జనగణన మొదలయ్యేలోగా జిల్లాల పునర్విభజనలో సరిహద్దు సమస్యలపై నివేదికివ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Similar News
News August 7, 2025
రూ.18 లక్షల జీతంతో ఉద్యోగాలు.. పెళ్లి కానివారు అర్హులు

ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ 379 టెక్నికల్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. బీటెక్ పూర్తైన లేదా చివరి ఏడాది చదువుతున్న 20-27 ఏళ్లలోపు పెళ్లికాని వారు అర్హులు. ఎంపికైతే ట్రైనింగ్‌లో ₹56,100 స్టైఫండ్ ఉంటుంది. లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుని ఏడాదికి రూ.18 లక్షలు(నెలకు ₹1.5లక్షలు) జీతం ఇస్తారు. పదేళ్లు విధుల్లో ఉండొచ్చు. అవసరమైతే పొడిగిస్తారు. లేదంటే తప్పుకోవాలి. AUG 22 చివరి తేదీ. వివరాలకు <
News August 7, 2025
ఎంపీ గోల్డ్ చైన్ పోతే 2 రోజుల్లో.. మరి మన పరిస్థితి?

తమిళనాడు ఎంపీ సుధ <<17298166>>గోల్డ్ చైన్<<>>ను దొంగిలించిన వారిని 2 రోజుల్లోనే పట్టుకున్న పోలీసులు.. సామాన్యుల ఫిర్యాదులపై అంత వేగంగా ఎందుకు స్పందించరని చర్చ జరుగుతోంది. 2014లో యూపీ మంత్రి అజామ్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో ఏడు గేదెలు చోరీకి గురైతే 24 గంటల్లో వాటి జాడ కనుక్కున్నారని గుర్తు చేస్తున్నారు. అదే సామాన్యులు జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ము చోరీ అయితే పోలీసులు ఇదే విధంగా స్పందిస్తారా? COMMENT.
News August 7, 2025
మరోసారి USకు పాక్ ఆర్మీ చీఫ్.. దేనికి సంకేతం?

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి USలో పర్యటించనున్నారు. భారత్‌తో సీజ్‌ఫైర్ తర్వాత ట్రంప్‌తో మునీర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నెలాఖర్లో US ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ మిచెల్ కురిల్లా రిటైర్ కాబోతున్నారు. ఆమె ఫేర్‌వెల్ వేడుకకు ఆసిమ్ హాజరుకానున్నారు. ఇప్పటికే పాక్‌తో ఆయిల్ డీల్ కుదుర్చుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఒకపక్క ట్రేడ్ వార్, మరోపక్క పాక్-US సంబంధాలు బలపడటం INDకు ఆందోళన కలిగించే అంశమే.