News November 20, 2024
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
* టూరిజానికి పరిశ్రమ హోదా
* విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్‌కు ఆమోదం
* ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం
* సీఎన్జీపై వ్యాట్ 5శాతానికి తగ్గింపు
Similar News
News November 21, 2024
CBSE 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది జరిగే బోర్డు పరీక్షలకు CBSE షెడ్యూల్ ప్రకటించింది. 10, 12 తరగతుల ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పది పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి ఎగ్జామ్స్ ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని CBSE తెలిపింది. పూర్తి వివరాలను ఈ <
News November 20, 2024
నిన్న అమెరికా.. నేడు బ్రిటన్ క్షిపణులు ప్రయోగించిన ఉక్రెయిన్
అమెరికా లాంగ్ రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించి కాక పుట్టించిన ఉక్రెయిన్ తాజాగా బ్రిటిష్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. నార్త్ కొరియా బలగాలను రష్యా మోహరించిన కారణంగా తమ స్టార్మ్షాడో క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్‌కు UK అనుమతించింది. ఇరు దేశాల యుద్ధం తారస్థాయికి చేరడంతో రష్యా ప్రతిచర్యలపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది.
News November 20, 2024
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మక తప్పదా?
క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇంటర్నెట్ సెర్చ్ మార్కెట్లో గూగుల్ గుత్తాధిపత్యంపై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ బ్యాలెన్స్ అవ్వాలంటే క్రోమ్ బ్రౌజర్‌ను గూగుల్ విక్రయించేలా ఆదేశాలివ్వాలని కోర్టును అమెరికా న్యాయశాఖ(DoJ) కోరింది. అయితే.. క్రోమ్‌ను విక్రయిస్తే తమ వ్యాపారాలకు, వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని గూగుల్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.