News September 3, 2024

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం రూ.14,000 కోట్లతో 7 పథకాల అమలుకు కేంద్ర క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన భేటీలో రూ.2,817కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, రూ.3,979కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్, ముంబై-ఇండోర్ మధ్య 309కి.మీ రైల్వే లైన్, గుజరాత్‌లో సెమీ కండక్టర్ల ప్లాంటు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Similar News

News February 2, 2025

CM రేవంత్‌ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపించాలి: RS ప్రవీణ్

image

TG: KCR శారీరక స్థితి గురించి ఇటీవల CM రేవంత్ చేసిన <<15322522>>వ్యాఖ్యలపై<<>> BRS నేత RS.ప్రవీణ్ మండిపడ్డారు. ‘రేవంత్ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి. ఆయన మాటలు చూస్తుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ రోగి లక్షణాలుగా కనిపిస్తున్నాయి. CM బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పజెప్పి వారిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపిస్తే బాగుంటుందేమో. దీని గురించి వారి ఫ్యామిలీ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.

News February 2, 2025

ఇండియాకు WC అందించిన గొంగడి త్రిష

image

అండర్-19 ఉమెన్స్ WCలో 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. ఈ WCలో అత్యధిక రన్స్ త్రిషవే. బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ WCలో ఓపెనర్‌గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.

News February 2, 2025

పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స

image

AP: 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి నిధులు సాధించడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపుల్లేవని అన్నారు. బిహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు కుదించారని, దీని వల్ల ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.