News March 6, 2025
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

☛ ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం
☛ నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
☛ ఉగాది నుంచి ‘భూ భారతి’ అమలు
☛ ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
☛ కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు
☛ 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు
Similar News
News December 9, 2025
రామన్నపేట ఆర్ఐ రాజేశ్వర్ సస్పెండ్

రామన్నపేట రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రాజేశ్వర్‌ను సస్పెండ్ చేసినట్లు చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి తెలిపారు. కక్కిరేణిలోని శ్రీ భక్తమార్కండేయ స్వామి ఆలయానికి చెందిన 4.3 ఎకరాల భూమి ధరణిలో తప్పుగా నమోదైంది. దీనిపై 2024లో ఆర్ఐ పంచనామా చేసి ఆలయానికి చెందినదని నిర్ధారించారు. అయితే, 2025 జనవరిలో క్షేత్రస్థాయికి వెళ్లకుండా తప్పుడు పంచనామా ఇచ్చినందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు.
News December 9, 2025
మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
News December 9, 2025
పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?

తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.


