News April 15, 2025

రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

AP: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు CM చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.789 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఎల్-1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Similar News

News January 2, 2026

కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

image

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.

News January 2, 2026

ఏడాదిలో 166 పులుల మృత్యువాత

image

2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్‌గా పేరుపొందిన మధ్యప్రదేశ్‌లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ‘టైగర్స్ జనాభా సంతృప్తస్థాయికి చేరుకుంది. టెర్రిటరీల ఏర్పాటులో అవి ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో గొడవ పడి చనిపోతున్నాయి’ అని వన్యప్రాణి నిపుణుడు జైరాం శుక్లా తెలిపారు.

News January 2, 2026

చెల్లింపులన్నీ UPIలోనే.. ఏకంగా ₹300 లక్షల కోట్లు

image

UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్‌లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు. UPI చరిత్రలో ఇదే అత్యధికం. సగటున రోజుకు 698 మిలియన్ల డిజిటల్ పేమెంట్లు నమోదయ్యాయి. గతేడాది మొత్తం 228.3B ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹299.7 లక్షల కోట్లు కావడం గమనార్హం. 2024 కంటే సుమారు 33% ఎక్కువ.