News April 1, 2025
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి గుంటూరు GGH సూపరింటెండెంట్ ప్రభావతి తప్పకుండా దర్యాప్తునకు సహకరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ నెల 7, 8వ తేదీల్లో సంబంధిత PSలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సాకులు చూపుతూ ప్రభావతి దర్యాప్తునకు రావట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించగా.. 2 నెలల్లో ఒక్కసారే పిలిచారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
Similar News
News April 2, 2025
నటికి షాక్.. విడాకులకు అప్లై చేసిన భర్త

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న నటి రన్యారావుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెతో వివాహ బంధానికి ముగింపు పలికేందుకు భర్త జతిన్ సిద్ధమయ్యారు. ఈమేరకు కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. ఆమెతో పెళ్లైన నాటి నుంచి ఏదో ఒక వివాదం కారణంగా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన చెప్పారు. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెయిల్ కోసం రన్యారావు బెంగళూరు హైకోర్టును ఆశ్రయించారు.
News April 2, 2025
ముడా స్కామ్‌లో సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కాం కేసులో ED ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కర్ణాటక CM సిద్దరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ సవాల్ చేసింది. ఇందులో ఆయన హస్తం ఉందనడానికి తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కాగా ఈ కుంభకోణంలో సిద్దరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి, ఇతరుల ప్రమేయం ఉందని గతంలో ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News April 2, 2025
సింగిల్‌గా వస్తోన్న సంగీత్ శోభన్

‘మ్యాడ్ స్క్వేర్’తో విజయం అందుకున్న సంగీత్ శోభన్ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్’పై కొణిదెల నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకూ మల్టీస్టారర్ మూవీల్లో నటించిన సంగీత్ శోభన్ ఈ చిత్రంతో సోలోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మానస శర్మ తెరకెక్కించే ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.