News February 9, 2025

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

image

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.

Similar News

News November 25, 2025

GDK: ప్రోటోకాల్ వివాదం.. అంబేడ్కర్‌కు క్షీరాభిషేకం

image

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్‌ను విస్మరించడాన్ని నిరసిస్తూ రామగుండం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక కార్యక్రమాల్లో ఎంపీకి సరైన గౌరవం ఇవ్వకపోవడాన్ని ఖండించారు. ప్రోటోకాల్‌ను విస్మరించిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>