News March 25, 2025

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

image

AP: వివేకా హత్య కేసుపై SCలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు అఫిడవిట్ వేసింది. ‘MP అవినాశ్ చెప్పినట్లే సునీత, నర్రెడ్డిపై CBI అధికారి రాంసింగ్ కేసు నమోదు చేశారు. సునీత, నర్రెడ్డి, రాంసింగ్‌పై వివేకా PA కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును IO రాజు విచారించలేదు. తనను అవినాశ్ బెదిరించారని రాజు అంగీకరించారు. రిటైర్డ్ ASP రాజేశ్వర‌రెడ్డి, ASIG రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని నడిపించారు’ అని పేర్కొన్నట్లు సమాచారం.

Similar News

News November 5, 2025

ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

image

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్‌ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్‌ఛైర్‌లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.

News November 5, 2025

భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు BCCI జట్టును ప్రకటించింది. పంత్, అక్షర్ జట్టులోకి వచ్చారు.
✒ టెస్ట్ టీమ్: గిల్(C), పంత్ (VC), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురెల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్‌, నితీశ్, సిరాజ్, ఆకాశ్, కుల్దీప్

✒ ODI IND-A టీమ్: తిలక్‌(C), రుతురాజ్‌(VC), అభిషేక్‌, పరాగ్‌, ఇషాన్‌, బదోని, నిషాంత్‌, V నిగమ్‌, M సుతార్‌, హర్షిత్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్, ఖలీల్, ప్రభ్‌సిమ్రాన్

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.