News March 18, 2025

రన్యారావు కేసులో వెలుగులోకి కీలక విషయాలు

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తన స్నేహితుడు తరుణ్ రాజుతో 26 సార్లు దుబాయ్‌ వెళ్లినట్లు, ఆ సమయంలోనూ స్మగ్లింగ్ చేసినట్లు DRI కోర్టు విచారణలో పేర్కొంది. ఆ సమయంలో వీరిద్దరూ ఉదయం బయలుదేరి సాయంత్రం తిరిగొచ్చేవారంది. దుబాయ్‌లో రాజు ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వివరించింది.

Similar News

News January 23, 2026

సునీతా విలియమ్స్ పెన్షన్ ఎంతో తెలుసా?

image

27 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ తర్వాత రిటైర్ అయిన సునీతా విలియమ్స్‌కు ఏడాదికి దాదాపు ₹36 లక్షల పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. FERS ద్వారా అందే ఈ పెన్షన్‌తో పాటు, అమెరికా సోషల్ సెక్యూరిటీ స్కీమ్ నుంచి అదనపు నెలవారీ ఆదాయం కూడా లభిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, TSP ఇన్వెస్ట్‌మెంట్ సేవింగ్స్ వంటి బెనిఫిట్స్ అందుతాయి. నాసా నుంచి ప్రత్యేక మెడికల్ సపోర్ట్ కొనసాగుతుంది.

News January 23, 2026

దగ్గుబాటి సోదరులపై కోర్టు సీరియస్

image

TG: ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి సురేశ్, వెంకటేశ్, రానాపై నాంపల్లి కోర్టు ఆగ్రహించింది. ఎన్నిసార్లు కోర్డు ఆర్డర్స్ ధిక్కరిస్తారని ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని వ్యాఖ్యానించింది. ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని మండిపడింది. FEB 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని, లేదంటే నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంది.

News January 23, 2026

IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

IBPS ఆర్ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. 8,002 పోస్టుల భర్తీకి డిసెంబర్ 6,7,3,14 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.