News February 10, 2025

భార్యను నరికిన ఘటనలో కీలక విషయాలు

image

HYD మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన <<15405584>>ఘటనలో <<>>ప్రధాన నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లను పోలీసులు FIRలో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్‌లను నిందితులుగా పేర్కొన్నారు. గురుమూర్తిపై హత్య కేసులు, మిగతా ముగ్గురిపై BNS 85 సెక్షన్(గృహహింస) నమోదు చేశారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. అటు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Similar News

News November 24, 2025

ఇండియాలో చీపెస్ట్ కార్లు ఇవే..

image

1.మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు
2.మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3.రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4.టాటా టియాగో: రూ.4.57 లక్షలు
5.మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6.Citroen C3: రూ.4.80 లక్షలు
>పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌వే.

News November 24, 2025

RECORD: ఎకరం రూ.137 కోట్లు

image

TG: హైదరాబాద్ కోకాపేట్‌లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్‌లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

News November 24, 2025

‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

image

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?