News July 31, 2024

హమాస్ కీలక నేత హత్య

image

హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు గురైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్‌లోని నివాసంలో జరిగిన దాడిలో అతని బాడీగార్డ్ కూడా చనిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ హత్యకు పాల్పడింది ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News March 31, 2026

YouTubeలో ‘ధురంధర్‌-2’ కలకలం

image

బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ధురంధర్-2 మూవీ YouTubeలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీన్ని గమనించిన ఆ మూవీ ఫ్యాన్స్ SMలో పోస్టులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన మూవీ టీమ్ పైరసీపై యూట్యూబ్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించిన YouTube ఆ వీడియోను తొలగించింది. దీంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19న రిలీజైన మూవీ రూ.1,300+కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

News March 31, 2026

సల్మాన్ సరసన నయన్.. బ్లాక్‌బస్టర్ కొడతారా?

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమాలో ఫిమేల్ లీడ్ కన్ఫర్మ్ అయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. నయన్ ఇప్పటికే షారుఖ్ ‘జవాన్’తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సల్మాన్ మూవీపై బజ్ పెరిగింది.

News March 31, 2026

‘భస్మాసుర హస్తం’ అంటే?

image

ఉపకారం చేసినవాడికే అపకారం తలపెట్టే సందర్భంలో ‘భస్మాసుర హస్తం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. పురాణాల్లో భస్మాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడిని ప్రసన్నం చేసుకొని, తన చేతిని ఎవరి తలపై పెడితే వారు భస్మం అయిపోవాలనే వరం పొందుతాడు. అయితే దాన్ని శివుడిపైనే పరీక్షించాలనుకుంటాడు. చివరికి విష్ణుమూర్తి ‘మోహిని’ అవతారమెత్తి భస్మాసురుడి చేయిని అతని నెత్తిన పెట్టుకొనేలా చేసి హతం చేస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>