News December 24, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు

TG: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను జనవరి 31లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు DEOలు, MEOలు, HMలను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల వివరాల సేకరణకు ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 3 శాతమే పూర్తయింది. దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
Similar News
News January 26, 2026
ఇల్లు/షాప్ ముందు ఎలాంటి గుమ్మడికాయ కట్టాలి?

దిష్టి తగలకుండా కట్టే గుమ్మడికాయ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. దానికి తొడిమ తప్పనిసరిగా ఉండాలి. తొడిమ ఊడిపోయిన దానిని కట్టకూడదు. దీనిని ఇంటికి తెచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బోర్లించకూడదు. తొడిమ పైకి ఉండేలా పట్టుకుని రావాలి. అలాగే గుమ్మడికాయను నీటితో కడగడం నిషిద్ధం. అలా చేస్తే దానికున్న శక్తి తగ్గిపోతుందని అంటారు. కడగకుండానే పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. సూర్యోదయానికి ముందే కట్టాలి.
News January 26, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సంతోష్‌రావుకు సిట్ నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ ఎంపీ సంతోష్‌రావుకు సిట్ నోటీసులిచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు HYD జూబ్లీహిల్స్‌లోని పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇటీవల బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే. అటు రేపటి విచారణకు హాజరై, సిట్ ప్రశ్నలకు సమాధానం చెబుతానని సంతోష్‌రావు తెలిపారు.
News January 26, 2026
కట్టె జనుము పంటకు ఈ దశలో నీటి తడులు తప్పనిసరి

వరి మాగాణిలో కట్టె జనుము పంటను సాగు చేస్తే మొదటి తడి అవసరం లేకుండా విత్తనాలు మొలకెత్తుతాయి. అయితే పంట మొలిచాక తొలి దశలో అనగా 25 రోజులకు, పూత, విత్తనం ఏర్పడే దశలో పంటను నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పంట కాలంలో రెండు నుంచి 3 నీటి తడులను అందిస్తే మంచి దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


