News September 10, 2024

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు

image

AP: పల్నాడు జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది రోజూ 3 సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉ.10.30 గం. కంటే ముందు, మ.3 గం.కు, సా.5 తర్వాత అటెండెన్స్ వేయాలంది. గతంలోనే ఈ రూల్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో ఇక నుంచి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, MPDOలు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది.

Similar News

News October 26, 2025

ప్రైవేట్ ట్రావెల్స్ వద్దు బాబోయ్!

image

కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులంటేనే వణికిపోతున్నారు. ఆలస్యమైనా ఫర్వాలేదు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్-విజయవాడ మధ్య సుమారు 250 కి.మీ దూరం ఉంటే ప్రైవేట్ బస్సులు 3 గంటల్లోనే వెళ్తాయి. దీన్ని బట్టి అవి ఎంత వేగంగా దూసుకెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ స్పీడ్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

News October 26, 2025

కార్తీకంలో ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే

image

సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం|
నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే||
‘ఓ దామోదరా, అన్ని పాపాలను పోగొట్టే పుణ్యమైన ఈ కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయి. నీకు నమస్కారం అని’ అని ఈ శ్లోక అర్థం. కార్తీక మాసంలో ఈ శ్లోకం పఠించి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పేర్కొంటున్నాయి.

News October 26, 2025

ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఫెడరల్ బ్యాంక్ సేల్స్& క్లయింట్ అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లలోపు ఉండాలి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.800, ST,SCలకు రూ.160. రాత పరీక్ష నవంబర్ 16న నిర్వహిస్తారు. వెబ్‌సైట్:https://www.federalbank.co.in/