News February 21, 2025
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News February 22, 2025
బీఆర్ఎస్ హయాంలో అనేక రంగాల్లో వృద్ధి: KTR

TG: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో ఇదే విషయాన్ని ప్రస్తావించారని మీడియా సమావేశంలో తెలిపారు. రేవంత్ ఏమైనా మాట్లాడే ముందు Dy.CM భట్టి ఇచ్చిన నివేదికను చదవాలని సూచించారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో అనేక రంగాల్లో వృద్ధి జరిగిందని తెలిపారు. తాము దిగిపోయే నాటికి రాష్ట్రం తలసరి ఆదాయంలో నం.1గా ఉందని పేర్కొన్నారు.
News February 22, 2025
టన్నెల్ ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి

TG: శ్రీశైలం ఎడమగట్టు కాలువ <<15542453>>టన్నెల్ ప్రమాదంపై<<>> సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. వెంటనే అక్కడికెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
News February 22, 2025
ఆగస్టు 1న తేజా సజ్జ ‘మిరాయ్’ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్పై భారీ అంచనాలున్నాయి.