News January 29, 2025

ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు

image

TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపును ఫిబ్రవరి 2లోగా పూర్తి చేయాలని అధికారులను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సా.5గంటల లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి ₹12వేలు అందించనుంది. ఇప్పటికే తొలి విడతలో పలువురికి ₹6వేల చొప్పున జమ చేసింది.

Similar News

News January 21, 2026

అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 1/2

image

TGలో నైనీ కోల్ బ్లాక్ వివాదం పెనుదుమారం రేపుతోంది. ఒడిశాలోని నైనీలో ఉన్న బొగ్గు గనిని గతంలో కేంద్రం సింగరేణికి కేటాయించింది. తవ్వకాలకు సింగరేణి నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు ఈ నెల 29 వరకు గడువు విధించింది. అయితే నోటిఫికేషన్‌లో 1.8 నిబంధన ప్రకారం గని తవ్వాల్సిన ప్రాంతాన్ని సందర్శించి, అన్ని వివరాలు తెలుసుకున్నట్లు GM నుంచి తీసుకున్న ధ్రువపత్రాన్ని జత చేయాలని తెలిపింది. ఇక్కడే అసలైన వివాదం మొదలైంది.

News January 21, 2026

అసలు ఏమిటీ ‘నైనీ కోల్ బ్లాక్’ వివాదం? 2/2

image

TG: సింగరేణి నిబంధన ప్రకారం తాము నైనీ కోల్ బ్లాక్‌ను సందర్శించినా GM సర్టిఫికెట్ ఇవ్వలేదని, దీంతో టెండర్లలో పాల్గొనలేకపోతున్నామని కొన్ని కంపెనీలు ఆరోపించాయి. పలువురు మంత్రులు తమ వారికే టెండర్ ఇప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలూ గుప్పుమన్నాయి. దీంతో వివాదం ముదరడంతో Dy.CM భట్టి టెండర్ నోటిఫికేషన్ రద్దు చేశారు. ఇంతలో గొడవలోకి ఎంటరైన కేంద్రం ఇలా అయితే సింగరేణిని తామే నిర్వహిస్తామంటూ హెచ్చరించింది.

News January 21, 2026

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!

image

సరైన జీవనశైలితో అనారోగ్యాన్ని 90శాతం వరకూ దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 3-4 సార్లు వ్యాయామం, ప్రతిరోజూ 10 వేల అడుగుల నడక గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. ‘సరైన సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే ఎండలో నిలబడటం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. పోషకాహారం తీసుకోవడం, రోజుకు 3 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది’ అని చెబుతున్నారు. share it