News December 8, 2024

నేడు KCR అధ్యక్షతన కీలక భేటీ

image

TG: మాజీ CM KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ఉదయం 10.30గంటలకు జరిగే ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా KCR సూచనలు చేస్తారని సమాచారం. అటు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీమంత్రి హరీశ్ రావు నేడు ఛార్జిషీట్ విడుదల చేయనున్నారు.

Similar News

News December 26, 2024

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో అంతరాయం!

image

ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొబైల్ డేటా & బ్రాడ్‌బ్యాండ్ సేవలు రెండింటిలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. వెబ్‌సైట్ స్టేటస్ ట్రాకింగ్ టూల్ Downdetector.com ప్రకారం దాదాపు 46% మంది మొత్తం బ్లాక్‌అవుట్‌ను ఎదుర్కొంటున్నారు. 32% మందికి సిగ్నల్ లేదు & 22% మందికి మొబైల్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?

News December 26, 2024

సీఎంతో భేటీపై నిర్మాణ సంస్థ ట్వీట్

image

సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్‌పై నిర్మాణ సంస్థ SVC ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ప్రభుత్వం & టాలీవుడ్ ప్రతినిధుల మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ దూరదృష్టి గల నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. షూటింగ్‌లకు HYDని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు DY.CM భట్టి, మంత్రి కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నారు. టాలీవుడ్ TG ప్రభుత్వానికి మద్దతునిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో పాల్గొంటుంది’ అని తెలిపింది.

News December 26, 2024

ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా

image

ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్‌బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలో‌వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.