News November 4, 2024

రేపు కప్పట్రాళ్లలో కీలక సమావేశం

image

AP: కర్నూలు జిల్లా దేవనకొండ(మ) కప్పట్రాళ్లలో రేపు కీలక సమావేశం జరగనుంది. యురేనియం పరీక్షలను వ్యతిరేకిస్తూ రెండ్రోజులుగా ఆందోళనలు చేస్తున్న స్థానికులను అధికారులు చర్చలకు ఆహ్వానించారు. కప్పట్రాళ్లతో పాటు సమీప గ్రామ ప్రజలకు ఆహ్వానాలు పంపారు. శాస్త్రవేత్తల బృందం, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ప్రజలతో చర్చించనున్నారు. వారిలో మెదులుతున్న అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

Similar News

News November 18, 2025

ఏపీ అప్డేట్స్

image

* రాష్ట్రంలో ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల.. ఇప్పటికే రూ.560 కోట్లు ఖాతాల్లో జమ చేశామని ప్రకటన
* రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.6.22 కోట్లు మంజూరు.. గురుకుల హాస్టళ్లు, స్టడీ సర్కిళ్లకు రూ.3.06 కోట్లు
* పరకామణి చోరీ ఘటనపై తిరిగి కేసు నమోదు చేయాలని TTD పాలక మండలి సమావేశంలో నిర్ణయం

News November 18, 2025

లైంగిక వేధింపుల కేసు.. మాజీ సీఎంకు సమన్లు

image

మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ CM, BJP నేత BS యడియూరప్పకు ఫాస్ట్రాక్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది FEBలో మీటింగ్ కోసం ఆయన నివాసానికి వెళ్లిన తన 17 ఏళ్ల కూతురిని యడియూరప్పతో పాటు మరో ముగ్గురు లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై పోక్సో కేసు నమోదైంది. ఈక్రమంలోనే యడియూరప్ప సహా నలుగురు DEC 2లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ కోర్టు సమన్లు ఇచ్చింది.

News November 18, 2025

గిల్ స్థానంలో గైక్వాడే కరెక్ట్: ఆకాశ్ చోప్రా

image

గిల్ SAతో రెండో టెస్టు ఆడతారా, లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆడకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ని తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. ‘గిల్ స్థానంలో ఆడేందుకు సాయి సుదర్శన్, పడిక్కల్ ఉన్నారు. కానీ వారిలో ఎవరిని తీసుకున్నా జట్టులో ఏడుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లవుతారు. అది మంచిది కాదు. రుతురాజ్ డొమెస్టిక్‌గా బాగా రాణిస్తున్నారు. అతనే కరెక్ట్ అనిపిస్తోంది’ అని తెలిపారు.