News July 3, 2024
ఇసుక విధానం అమలుపై కీలక సమావేశం

AP: నూతన ఇసుక పాలసీపై అధికారులతో CM చంద్రబాబు కూలంకషంగా చర్చించారు. వర్షాకాలం కావడంతో నదుల్లో వరదొస్తే తవ్వకాలకు అవకాశం ఉండదని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు విన్నవించారు. కాగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయిస్తే ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ద్వారా పర్మిట్లు అందిస్తే అక్రమాలకు అవకాశం ఉండదని యోచిస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 20, 2026
స్కిప్పింగ్తో ఎన్నో లాభాలు

ప్రతిరోజు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్ చేయడం వల్ల కండరాలు పటిష్ఠడతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్ చేయడం ద్వారా డోపమైన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది.
News January 20, 2026
72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

నిరసనకారులకు ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. 72 గంటల్లోగా లొంగిపోవాలని, లేదంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ పోలీస్ చీఫ్ అహ్మద్ రెజా హెచ్చరించారు. అల్లర్లలో పాల్గొన్న యువకులను శత్రు సైనికులుగా కాకుండా మోసపోయిన వారిగా పరిగణిస్తామని చెప్పారు. గడువులోగా సరెండర్ అయితే వారిపై దయతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. 2 వారాలుగా ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో వేలాది మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News January 20, 2026
అడవులు ఖాళీ.. ఇక దోమల టార్గెట్ మనుషులే!

అడవులు తగ్గిపోతుండటంతో దోమలు ఇప్పుడు జంతువులకు బదులుగా మనుషుల రక్తం తాగడానికి ఇష్టపడుతున్నాయని బ్రెజిల్లో జరిగిన స్టడీలో తేలింది. అడవులు అంతరించిపోవడం వల్ల జంతువులు దూరమై దోమలకు వేరే ఆప్షన్ లేక మనుషులపై పడుతున్నాయట. 1,700 దోమలపై జరిపిన ఈ అధ్యయనంలో అవి మనుషుల రక్తానికే ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిసింది. దీనివల్ల ఫ్యూచర్లో కొత్త రకమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.


