News February 16, 2025
‘సచివాలయ’ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై రేపు కీలక భేటీ

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి భేటీ కానున్నారు. <<15268707>>క్రమబద్ధీకరణ<<>> తర్వాత మిగిలిపోయే 40వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు.
Similar News
News January 8, 2026
ఉరి వేసుకుని మిర్యాలగూడలో మహిళ ఆత్మహత్య

ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డపాక జగదీష్ తన భార్య నాగమణితో కలిసి పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం బాత్రూంకు వెళ్లిన నాగమణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. మృతురాలి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 8, 2026
జనవరి 8: చరిత్రలో ఈరోజు

* 1642: ప్రముఖ భౌగోళిక శాస్త్రజ్ఞుడు గెలీలియో మరణం. * 1942: భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జననం * 1962: లియోనార్డో డావిన్సీ వేసిన ‘మోనాలిసా’ పెయింటింగ్‌ను USలో తొలిసారి ప్రదర్శించారు. * 1975: మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ పుట్టినరోజు * 1983: హీరో తరుణ్ బర్త్‌డే (ఫొటోలో) * 1987: IND మాజీ క్రికెటర్ నానా జోషి మరణం
News January 8, 2026
కేరళలో ఫేక్ డిగ్రీ రాకెట్.. ఆస్ట్రేలియాలో దుమారం!

కేరళలో బయటపడిన ఫేక్ డిగ్రీ రాకెట్ ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. నకిలీ సర్టిఫికెట్లతో వస్తున్న విదేశీ విద్యార్థులను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని ఆసీస్ సెనేటర్లు మండిపడుతున్నారు. వాటితోనే ఇక్కడ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాగా ఫేక్ డిగ్రీలు అమ్ముతున్న 11 మందిని ఇటీవల కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 10 లక్షల మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.


