News February 27, 2025

ఇళ్ల నిర్మాణంపై కీలక ఉత్తర్వులు

image

APలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ శాఖ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలంది. ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాలు తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య పత్రం జారీ చేయకూడదని పేర్కొంది. ఆ పత్రం లేకపోతే తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకులు రుణాలు ఇవ్వొద్దని తేల్చి చెప్పింది.

Similar News

News November 19, 2025

బంధంలో సైలెంట్ కిల్లర్

image

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.

News November 19, 2025

హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

image

ఛత్తీస్‌‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.

News November 19, 2025

తొలి ఆదివాసీ అగ్రనేత హిడ్మాయే!

image

భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందిన హిడ్మా ప్రస్థానం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ప్రాంతంలో ఆదివాసీ గ్రామ ఆర్గనైజర్‌గా ప్రారంభమైంది. అనంతరం మావోయిస్టుల యాక్షన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగి, చివరకు కేంద్ర కమిటీకి చేరిన తొలి ఆదివాసీ అగ్రనేతగా నిలిచాడు. భద్రతా బలగాలను తప్పుదారి పట్టించి, దాడులు నిర్వహించడం హిడ్మా స్టైల్. మావోయిస్టుల నిఘా వ్యవస్థతో పాటు హిడ్మాకు ప్రత్యేక వ్యవస్థ ఉండేది.