News February 10, 2025
కల్తీ నెయ్యి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలు వెల్లడించింది. నిందితులు ఆధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా ఏఆర్, వైష్ణవి డెయిరీలు టెండర్లలో పాల్గొన్నాయని పేర్కొంది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడంలేదని తెలిపింది.
Similar News
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.
News December 15, 2025
చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
News December 15, 2025
డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం


