News November 6, 2024

ట్రంప్ క్యాబినెట్లో ఇండియన్ అమెరికన్స్‌కు కీలక పదవులు!

image

డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్లో ఇండియన్ అమెరికన్స్‌కు కీలక పదవులు దక్కొచ్చు. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, తులసీ గబ్బార్డ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం గ్యారంటీ. వివేక్‌కు VC పదవిని ఆఫర్ చేసేందుకు వెనకాడనన్న ట్రంప్ అతడి తెలివితేటలకు ఫిదా అయ్యారు. ఇక ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో తులసి పాత్ర కీలకం. దాదాపుగా ఆయన స్పీచుల్ని ఆమే రాశారు. ప్రజలను ఆలోచింపజేసేలా ఆమె రైటింగ్స్ ఉంటాయి. ఇక హేలీకి రాజకీయ అనుభవం ఎక్కువ.

Similar News

News October 19, 2025

దీపావళి: లక్ష్మీ పూజలో ఏ వస్తువులు ఉండాలి?

image

దీపావళి లక్ష్మీ పూజలో సమర్పించే కొన్ని వస్తువులు ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ చిత్ర పటాలు పెడితే శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దేవతల నివాసంగా పేర్కొనే శంఖాన్ని, సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి నాణేలు, నోట్లు, పసుపు గౌరమ్మలను పూజలో ఉంచాలని సూచిస్తున్నారు. కమల పువ్వులు, శ్రీ యంత్రం, పసుపు కొమ్ములు ఉంచడం అదృష్టాన్ని తెస్తుందంటున్నారు.

News October 19, 2025

కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

image

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.

News October 19, 2025

వంటింటి చిట్కాలు

image

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.