News March 13, 2025
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు

AP: వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఒకే సబ్జెక్ట్‌గా మ్యాథ్స్ ఎ-బి, బోటనీ-జువాలజీని చేయనున్నారు. జూనియర్ కాలేజీల్లో ఎంబైపీసీ కోర్సుకు అనుమతి ఇవ్వనున్నారు. జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
Similar News
News December 23, 2025
ఈ నెలాఖరు నుంచి ఫ్యామిలీ సర్వే

AP: ఈ నెలాఖరు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(UFS) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపింది. ‘అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడం, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడం ఈ సర్వే ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్ల జారీ సులభతరమవుతుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లదు’ అని పేర్కొంది.
News December 23, 2025
చలికాలంలో వెచ్చని ప్రదేశాలకు టూర్!

వింటర్ ట్రావెల్‌కు పర్ఫెక్ట్ డెస్టినేషన్ గోవా. సూర్యుని వెచ్చదనంతో ఆకర్షణీయమైన బీచ్‌లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అండమాన్ దీవులు, రాజస్థాన్‌లోని జైసల్మేర్, అలెప్పీ(కేరళ బ్యాక్‌వాటర్స్), గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్, పుదుచ్చేరి, కర్ణాటకలోని హంపి, బెంగాల్‌లోని మందార్‌మణి, కేరళలోని వర్కల, తమిళనాడులోని కన్యాకుమారి వింటర్లో పర్యటించేందుకు అనుకూలం. DEC-FEB వరకు ఈ ప్రాంతాల్లో 25-30 డిగ్రీల టెంపరేచర్లు ఉంటాయి.
News December 23, 2025
శరీరానికే వైకల్యం.. సంకల్పానికి కాదు: IESలో మానవేంద్ర వండర్!

శారీరక వైకల్యం అడ్డువచ్చినా, పట్టుదలతో భారతీయ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షలో 112వ ర్యాంక్ సాధించారు మానవేంద్ర సింగ్. తండ్రి చనిపోయినా, తల్లి రేణు సింగ్ ఇచ్చిన ధైర్యంతో ఈ విజయం అందుకున్నారు UPలోని బులంద్‌షహర్‌కు చెందిన ఈ కుర్రాడు. పట్నాలో బీటెక్ చేస్తుండగానే IES ఆఫీసర్ కావాలని కలలు కన్నారు. ఇప్పుడు అది నిజం కావటంతో కుటుంబ సభ్యులు, ఊరి జనం మానవేంద్రను అభినందనలతో ముంచెత్తుతున్నారు.


