News March 24, 2025
KG చికెన్‌కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్‌కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్‌లో ప్రతి కేజీ చికెన్‌పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News April 1, 2025
ప్రకాశం: నేడు సోషల్ పరీక్ష

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షకు హాజరు కాగలరన్నారు.
News March 31, 2025
ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.