News November 16, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

గత వారంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.210-230 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.230-240గా ఉంది. అటు ఏపీలోని విజయవాడలో రూ.250, గుంటూరులో రూ.260, ప.గో. జిల్లా భీమవరంలో రూ.230-250, ఏలూరులో రూ.230కి విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మటన్ కేజీ రూ.800కు పైగానే ఉంది. మరి మీ ఏరియాలో చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News November 16, 2025

SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

image

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News November 16, 2025

తమిళనాడు నుంచి ఏపీకి $150 మిలియన్ల పెట్టుబడులు

image

సౌత్ కొరియాకు చెందిన Hwaseung కంపెనీ ఏపీలో $150 మిలియన్ల పెట్టుబడులు పెట్టనుంది. కుప్పంలో నాన్-లెదర్ స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయనుంది. గ్లోబల్ బ్రాండ్లైన Nike, Adidasలను ఈ సంస్థే తయారు చేస్తుంది. కుప్పంలో ఏడాదికి 20 మిలియన్ల షూ జతలను ఉత్పత్తి చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఈ ఆగస్టులో తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నా తాజాగా ఏపీకి వస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

News November 16, 2025

టెస్టుకు దూరమైన గిల్

image

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.