News December 16, 2024

KGBVలకు డైట్ ఛార్జీలు వర్తింపజేయాలి: కవిత

image

KGBVలకు కూడా పెంచిన డైట్ ఛార్జీలను వర్తింపజేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె సారంగపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి మాట్లాడారు. పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింప జేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరికీ పౌష్ఠికాహారం అందించాలని కోరారు.

Similar News

News February 1, 2025

‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి

image

ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.

News February 1, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానల్‌లో కెమెరామ్యాన్ పనిచేస్తున్నాడు. రాత్రి ఎడపల్లి మండలం ఠానాకాలన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిపాల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 1, 2025

నిజామాబాద్ జిల్లా వెదర్ అప్డేట్@8AM

image

నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా పోతంగల్లో 17℃, నిజామాబాద్ 17.1, మోస్రా 17.2, జకోరా 17.3, మోర్తాడ్ 17.4, యడపల్లి 17.5, సాలూరా 17.6, పల్డా, మల్లాపూర్ 17.7, గోపన్నపల్లి, ఏర్గట్ల, జానకంపేట్ 17.8, చందూర్ 17.9, మెండోరా, కొటగిరి, చిన్న మవంది, డిచ్‌పల్లి, చకొండూరు, కల్లూరి 18, లక్స్మాపూర్, బెల్లాల్, గన్నారం, నిజామాబాద్ పట్టణంలో 18.1℃గా నమోదయ్యాయి.