News July 18, 2024
KGHలో ఓపి తీసుకోవాలంటే ఈ యాప్ తప్పనిసరి

KGHలో వైద్యానికి వచ్చేవారికి abha యాప్ తప్పని సరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ ఫోన్ ద్వారా టోకెన్ వస్తుంది. టోకెన్ నంబర్ చెబితే కౌంటర్‌లో ఓపి సీట్ ఇస్తారు. మొబైల్ ఫోన్ లేనివారు ఆధార్ కార్డుతో డైరెక్టుగా ఓపి తీసుకోవచ్చు. మొబైల్ యాప్ వినియోగం తెలియని వారికి స్థానికంగా స్టాఫ్ నర్సులు సహాయం అందిస్తారు.
Similar News
News February 23, 2026
మధురవాడ: డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక- మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.
News February 23, 2026
విశాఖలో ట్రాఫిక్ టెన్షన్.. విద్యార్థులు విలవిల

విశాఖపట్నంలో భారీగా నిలిచిపోతున్న ట్రాఫిక్ ఇంటర్మీడియట్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోలేమోనన్న టెన్షన్‌తో విద్యార్థులు సతమతమవుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పరీక్షా సమయం మించిపోతుందని భయపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా విద్యార్థులు కాస్త ముందుగానే బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.
News February 23, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.


