News August 22, 2024

KGHలో విద్యార్థులకు సీఎం పరామర్శ

image

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధిత విద్యార్థులు KGHలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం సెజ్ మృతుల బంధువులతో మార్చురీ వద్ద మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు విద్యార్థుల వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

Similar News

News September 14, 2024

విశాఖ: పలు అభివృద్ధి పనులకు స్థాయి సంఘం ఆమోదం

image

విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం లభించినట్లు మేయర్ హరి వెంకట కుమారి తెలిపారు. మేయర్ అధ్యక్షతన స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 250 అంశాలతో అజెండాను ప్రవేశ పెట్టగా 102 అంశాలకు ఆమోదం లభించిందని అన్నారు. సమయాభావం కారణంగా మిగిలిన అంశాలను వాయిదా వేసినట్లు తెలిపారు.

News September 13, 2024

విశాఖ: బ్లాస్ట్ ఫర్నేస్-3 ని మూసివేసిన అధికారులు

image

అతిపెద్ద కర్మాగారం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ -3ని అధికారులు మూసివేశారు. బొగ్గు లేకపోవడం వల్ల దీనిని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్లాస్ట్ ఫర్నేస్ -1 మూతపడింది. రూ8 వేల కోట్ల అప్పుల్లో స్టీల్ ప్లాంట్ మునిగిపోయినట్లు కార్మికులు తెలిపారు.

News September 13, 2024

వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం

image

విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.