News January 17, 2026
KGHలో ఆన్‌లైన్ వైద్య సేవలు

ఇకపై KGHలో గంటల తరబడి ఓపీ, ఇతర వైద్య పరీక్షల కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలకు చెక్ పెట్టే దిశగా ఈ-పాలన విధానాన్ని KGH అమలు చేయనుంది. రోగులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వైద్య సేవలను ఆన్‌లైన్ విధానంలో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు KGH అధికారులు తెలిపారు.
Similar News
News February 13, 2026
విశాఖలో అంతర్జాతీయ నౌకా దళ విన్యాసాలు.. పటిష్ఠ భద్రత

ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల కోసం విశాఖలో 7,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రాష్ట్రపతి, 75 దేశాల ప్రతినిధులు హాజరవుతున్న ఈ మహా వేడుక కోసం 64 డ్రోన్లు, ఆధునిక యాప్‌లతో నిఘా పెంచారు. తీర భద్రతను కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని 112 తెలియజేయాలని కోరారు.
News February 13, 2026
విశాఖ: ముడి సరుకు కొరత.. ప్లాంట్‌లో తగ్గిన ఉత్పత్తి

విశాఖ ఉక్కు కర్మాగారంలో వారం రోజులుగా హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గింది. రోజుకు 19 వేల టన్నుల లక్ష్యానికి బదులుగా 16,730 టన్నులకు పరిమితమైంది. కోక్ కొరత, పాత కోక్ ఓవెన్ బ్యాటరీల సామర్థ్యం తగ్గడం ప్రధాన కారణాలుగా అధికారులు చెబుతున్నారు. సరిపడా ముడి పదార్థాలు అందకపోవడంతో అధిక ధరకు కోక్ కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఉత్పత్తి లక్ష్యం తగ్గిందంటూ జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
News February 12, 2026
విశాఖ: 18 ఏళ్లుగా తప్పించుకుంటున్న నిందితుడి అరెస్ట్

18 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్ రెహనుల్లా సిద్ధిఖీని విశాఖ 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2002 నుంచి పరారీలో ఉన్న ఇతనిని గాండీవ యాప్, పాన్ (PAN) వివరాల ఆధారంగా చెన్నైలో గుర్తించారు. నిందితుడిపై హత్యతోపాటు పలు కేసులు ఉన్నాయి. ఎస్సై బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు.


