News February 17, 2025
KGHలో ఆమె జీబీఎస్‌తో చనిపోలేదు..!

విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలోచేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’ అని ఆయన తెలిపారు.
Similar News
News March 13, 2025
విశాఖ: హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు

ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయన్న నెపంతో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లకు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విశాఖకు చెందిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. స్కూల్ యాజమాన్యాలు ఫీజులపై ఈ సమయంలో ఒత్తిడిని పెంచడం సమంజసం కాదన్నారు. ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులు పరీక్షలు రాయవచ్చన్నారు.
News March 13, 2025
పద్మనాభం: భూములు పరిశీలించిన జేసీ మాయూర్ అశోక్

పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, రెడ్డిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్ పరిశీలించారు. తహసీల్దారు కె.ఆనందరావుతో కలిసి ఆయా గ్రామాల్లోని భూములను పరిశీలించారు. వాటి రికార్డులు, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అవకాశాలు కుదిరితే ఈ భూములను ఏపీఐఐసీకి బదలాయించి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.
News March 13, 2025
విశాఖ: పరీక్ష బాగా రాయలేదని విద్యార్థిని సూసైడ్

ఫిజిక్స్ పరీక్ష సరిగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో చోటుచేసుంది. సర్క్యూట్ హౌస్ సమీపంలో నివాసముంటున్న ఓ విద్యార్థిని ఫిజిక్స్ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి పరీక్ష బాగా రాయలేదని బాధపడగా ఆమె తల్లి ఓదార్చి నిద్రపోయింది. బుధవారం ఉదయం ఆమె నిద్రలేచి చూసేసరికి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.