News August 8, 2025

KGHలో లంచం లేనిదే పనవ్వదా?

image

KGHలో వైద్య సేవలపై ప్రజలకు రోజురోజుకీ నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ విమర్శలకు Way2Newsలో ఈరోజు పబ్లిష్ అయిన ‘<<17338114>>చేతులే.. వీల్‌ ఛైర్<<>>’ అన్న వార్తకు వచ్చిన కామెంట్లే నిదర్శనం. ‘లంచం లేనిదే ఇక్కడ పనవ్వదని’, ‘రోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తారు’అని ఆరోపించారు. కార్పొరేట్ ఆసుపత్రుకు వెళ్లలేని నిరుపేదలు కొనఊపిరితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇక్కడికి వస్తారు. ఇప్పటికైనా సంబంధిత మంత్రి దృష్టి సారించాల్సి ఉంది.

Similar News

News August 8, 2025

Zach Vukusic: 18 ఏళ్లకే కెప్టెన్

image

క్రొయేషియాకు చెందిన జాక్ గ్జేవియర్ మిక్లీ వుకుసిక్ (17Y 312D) ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. దీంతో 18 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి ఆటగాడిగా వుకుసిక్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 6 T20లే ఆడటం గమనార్హం. జాక్ తర్వాత నోమన్ అంజాద్ (18Y 24D), కార్ల్ హర్ట్‌మన్లెస్లే (18Y 276D), ఎర్డెన్ బుల్గాన్(18Y 324D), డికుబ్విమానా (19Y 327D) పిన్న వయసు కెప్టెన్లుగా చేశారు.

News August 8, 2025

పులివెందుల ZPTC గెలవాలి: చంద్రబాబు

image

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో గెలవాలని కూటమి నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గెలవాలనే సంకల్పంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికపై కూటమి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పులివెందులను మరింత అభివృద్ధి చేద్దామన్నారు. టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలను అందించి పంటలను కాపాడినట్టు గుర్తుచేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

News August 8, 2025

ఎపిసోడ్‌కు రూ.14 లక్షలు.. స్మృతి ఇరానీ ఏమన్నారంటే?

image

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీజన్-2’లో ఆమె నటిస్తున్నారు. ఇందులో ఎపిసోడ్‌కు రూ.14 లక్షల చొప్పున ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి స్పందిస్తూ టెలివిజన్ ఇండస్ట్రీలో తానే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఎంత అమౌంట్ తీసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.