News September 12, 2025

KGH అభివృద్ధిపై విభాగాధిపతులతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష

image

KGH అభివృద్ధిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్ని విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది అవసరాలు, వసతులపై చర్చించారు. ఆంకాలజీకి 30 మంది స్టాఫ్ నర్సులు, గ్యాస్ట్రో విభాగానికి పరికరాలు, ఎండోక్రనాలజీకి మరమ్మతులు ప్రతిపాదించారు. వార్డుల వారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

Similar News

News September 12, 2025

రేపు విశాఖ రానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

image

కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం విశాఖ రానున్నారు. శనివారం రాత్రి 8:50కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి నోవాటల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రైల్వే గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం పలువురు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

News September 12, 2025

విశాఖ రానున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

image

రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం విశాఖ రానున్నారు. శనివారం ఉదయం 8గంటలకు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ వెళ్తారు. దీనికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 12, 2025

విశాఖ‌లో ఈ-గవర్నెన్స్‌పై జాతీయ సదస్సు: కలెక్టర్

image

విశాఖ‌లో సెప్టెంబ‌ర్ 22, 23వ‌ తేదీల్లో 28వ జాతీయ ఈ-గ‌వ‌ర్నెన్స్ సదస్సు జ‌ర‌గనుంది. వికసిత్ భారత్, సివిల్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరిట రెండు రోజుల నోవాటెల్ హాట‌ళ్లో నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి 1000 మంది అతిథులు, ఏపీ సీఎం, కేంద్ర‌, రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు భాగ‌స్వామ్యం కానున్నారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ శుక్రవారం ఆదేశించారు.