News September 16, 2024

ఖైరతాబాద్ గణేశుడి ఊరేగింపు.. ఈ మార్గాల్లో

image

TG: ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రేపు ఉ.6 గంటలకు కదలనున్నాడు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌దూత్ హోటల్(లక్డీకపూల్)-టెలిఫోన్ భవన్-తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్కగా సెక్రటేరియట్ ముందు నుంచి గణనాథుడి ఊరేగింపు కొనసాగనుంది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఏర్పాటు చేసిన క్రేన్ నం.4 వద్ద మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News February 9, 2026

ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న నటుడు!

image

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు దీపికా పదుకొణే తప్పుకోగా ఆమె స్థానంలో హీరోయిన్‌గా తృప్తి దిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.

News February 9, 2026

అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు: పొన్నం

image

TG: అసంపూర్తిగా ఉన్న బెడ్ రూం ఇళ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారికి ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. KNRలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ఇచ్చామని తెలిపారు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News February 9, 2026

ఫిబ్రవరి 9: చరిత్రలో ఈరోజు

image

♦︎ 1966: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ జననం ♦︎ 1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు ♦︎ 1975: సినీ నటుడు సుమంత్ జననం (ఫొటోలో) ♦︎ 2008: సంఘ సేవకుడు, పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మురళీధర్ దేవదాస్ ఆమ్టే మరణం ♦︎ 2012: సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం.