News August 2, 2024

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా విడుదల

image

TG: ఈ ఏడాది వినాయక చవితికి ప్రతిష్ఠించబోయే మహాగణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు విడుదల చేశారు. 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణ ఘట్టాలను ఏర్పాటు చేయనున్నారు. గణేశుడి విగ్రహం వద్ద అయోధ్య బాలరాముడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

Similar News

News November 25, 2025

రాములోరి జెండా ప్రత్యేకతలివే..

image

జెండాపై రాముడి సూర్యవంశం సూచించేలా భానుడు, విశ్వంలో సంపూర్ణ పవిత్ర శబ్దం ఓం, కోవిదారు వృక్ష చిహ్నాలున్నాయి. మందార, పారిజాత వృక్షాల అంటుకట్టుతో కశ్యప రుషి ఈ చెట్టును సృష్టించారని పురాణాలు తెలిపాయి. భరతుడి రథ ధ్వజంలోని జెండాలో గల ఈ చిహ్నం గురించి రఘువంశంలో కాళిదాసు ప్రస్తావించారు. ఈ జెండాను లక్ష్మణుడు దూరం నుంచే చూసి ‘సీతారాములను అయోధ్యకు తీసుకెళ్లేందుకు భరతుడు వస్తున్నాడ’ని అన్నకు సమాచారమిచ్చారు.

News November 25, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: అనంతపురం జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలోని వన్ స్టాప్ సెంటర్‌లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సైకో-సోషల్ కౌన్సెలర్, మల్టీ పర్పస్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ/సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News November 25, 2025

ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

image

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.