News August 14, 2024

ఎలాన్ మస్క్, జేకే రౌలింగ్‌పైనా ఖెలీఫ్ కేసు

image

అల్జీరియా వివాదాస్పద బాక్సర్ ఖెలీఫ్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. అనంతరం తనను నెట్టింట విమర్శించిన వారందరిపై ఆమె ఫ్రాన్స్‌లో దావా వేశారు. వారిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ‘హ్యారీపోటర్’ రచయిత్రి జేకే రౌలింగ్ కూడా ఉన్నారు. ఇటలీ బాక్సర్ ఓడిపోయిన సమయంలో ఖెలీఫ్‌ను విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మస్క్ మద్దతునిచ్చారు. అటు రౌలింగ్ సైతం ఖెలీఫ్ మగాడంటూ ట్వీట్ వేశారు.

Similar News

News February 8, 2025

సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ సంబరాలకు సిద్ధమవుతోంది. కేంద్ర కార్యాలయంలో సాయంత్రం సెలబ్రేషన్స్ చేసుకోనుంది. దీనికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు.

News February 8, 2025

‘తండేల్’ తొలి రోజు కలెక్షన్లు ఎన్నంటే?

image

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.21.27 కోట్లు(గ్రాస్) వచ్చినట్లు తెలిపారు. అయితే చైతూ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అని సినీవర్గాలు పేర్కొన్నాయి.

News February 8, 2025

రోహిత్ శర్మ ప్రాక్టీస్ ఆపేస్తే బెటర్: బంగర్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేస్తే మంచిదని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ‘ఏం చేసినా పరుగులు రాని దశను రోహిత్ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దశలో ఆయన సాధన ఆపేయడమే బెటర్. దాని బదులు ఒంటికి విశ్రాంతినిచ్చి తాను అద్భుతంగా ఆడినప్పటి ఇన్నింగ్స్‌ను చూడాలి. అప్పుడెందుకు బాగా ఆడారో అర్థం చేసుకోవాలి. రన్స్ కోసం ఆయన ట్రై చేసే కొద్దీ పరిస్థితి మరింత దిగజారొచ్చు’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!