News June 13, 2024

ఖలిస్థానీల దాష్టీకం.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం

image

జీ7 సదస్సు కోసం ఇవాళ ప్రధాని మోదీ ఇటలీ వెళ్లనుండటంతో ఖలిస్థానీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిన్న ధ్వంసం చేశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌కు అనుకూలంగా నినాదాలు రాశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ దాష్టీకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది.

Similar News

News October 25, 2025

ఆస్ట్రేలియా బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

image

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్, అర్షదీప్ స్థానంలో కుల్దీప్, ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చారు.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, సుందర్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్‌షా, కారే, కొన్నోలీ, ఓవెన్, నాథన్ ఎల్లిస్, స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.

News October 25, 2025

ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన

image

AP: మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII ఇన్వెస్టర్స్‌ మీట్‌కు వారిని ఆహ్వానించింది. నిన్న గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.

News October 25, 2025

నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం పలు మార్పుల తర్వాత ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.