News March 18, 2024

ఖమ్మం: రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకం

image

మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాగర్ రెండో జోన్ నుంచి సాగర్ జలాలు అందించేందుకు అధికారులతో రూపకల్పన చేయించారు. ఇందుకు రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రెండు మండలాల్లోని 33,025 ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించనున్నారు.

Similar News

News April 6, 2026

ఖమ్మం: గాలివాన వచ్చినా విద్యుత్ ఆగదు!

image

ఖమ్మం జిల్లాలో వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా అధికారులు 5 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఐటీఐ నిపుణులతో కూడిన ఈ బృందాలు ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో అందుబాటులో ఉంటాయి. వీరికి ప్రత్యేక వాహనాలు, పనిముట్లు అందించారు. సమస్య తలెత్తితే వెంటనే 1912 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.

News April 6, 2026

ఖమ్మం: జాగ్రత్త.. బయట ఆహారం వద్దు!

image

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బయట ఆహారం తీసుకోవద్దని, తగినంత మంచినీరు తాగుతూ ఎండల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. మరోవైపు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూ గొప్ప స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

News April 6, 2026

నేడు జిల్లావ్యాప్తంగా ‘ప్రజావాణి’

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కలెక్టరేట్‌కు లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు అందజేయవచ్చని సూచించారు. అర్జీలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.