News April 2, 2024

ఖమ్మం లోక్‌సభ సీటు అడిగా: వీహెచ్

image

TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఖమ్మం లోక్‌సభ సీటు ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు(వీహెచ్) తెలిపారు. టికెట్ ఇస్తే మెజారిటీతో గెలుస్తానన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరున్నారో తెలియాలని.. ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు.

Similar News

News April 16, 2026

మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా?.. లోకేశ్‌కు YCP కౌంటర్

image

AP: వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేశ్ చేసిన <<19664163>>విమర్శలకు<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజు అయినా ఇంటికి పిలిచి పట్టెడన్నం పెట్టావా? మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చింది.

News April 16, 2026

SRHకు షాక్.. IPL నుంచి మరో బౌలర్ ఔట్

image

IPL: SRH బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆయన కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు గాయంతో టోర్నీకి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో <<19463818>>పేన్<<>> జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

News April 16, 2026

ఏపీలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం.. వివరాలు నమోదు చేసుకున్న సీఎం

image

AP: స్వీయ జనగణనలో భాగంగా CM చంద్రబాబు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. http://se.census.gov.in సైట్ ద్వారా మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ సీఎంకు వివరించారు. ఈ నెల 30 వరకు ప్రజలు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మే 1 తేదీ నుంచి 30 వరకూ అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలిపారు.