News March 18, 2024
ఖమ్మం: మహిళా ఓటర్లే అధికం

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,23,814 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 8,39,640 మంది, పురుష ఓటర్లు 7,84,043 మంది ఉండగా, మహిళా ఓటర్లు 55,597 మంది ఎక్కువ. ఇంకా ఎన్ఆర్ఐ ఓటర్లు 222, సర్వీస్ ఓటర్లు 886 మంది ఉన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 3,22,259 మంది, తక్కువగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1,58,647 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News April 9, 2025
యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చే దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్లికేషన్లు సమర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పరిశీలించారు. కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కోసం 5 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
News April 9, 2025
గురుకుల కళాశాలలో ప్రవేశాలకు మే 10న ఎంట్రన్స్ పరీక్ష

ఖమ్మం: గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సం.కి ఇంటర్మీడియట్ మొదటి సం. ప్రవేశాలకు మే 10న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల జిల్లా సమన్వయ అధికారిణి రమ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్లలో చేరుటకు మే 10న ఉ.10 నుండి మ.12-30 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. www.tgrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News April 8, 2025
క్షయ వ్యాధి నివారణపై అవగాహన కల్పించాలి: DMHO

రఘునాథపాలెం: క్షయ వ్యాధి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎంహెచ్వో డా. కళావతి బాయ్ అన్నారు. జిల్లాలో పని చేస్తున్న మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు విధి నిర్వహణ పై జిల్లా కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన పెంచాలన్నారు.