News December 6, 2024
UPCC కమిటీలను రద్దు చేసిన ఖర్గే

ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రద్దు చేశారు. రాష్ట్ర, జిల్లా, నగర, బ్లాక్ కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీని బలపరిచేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది.
Similar News
News November 27, 2025
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.
News November 27, 2025
మిరపలో బూడిద తెగులు – నివారణ

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News November 27, 2025
ఏకగ్రీవం.. ఒకే కుటుంబం నుంచి సర్పంచ్, వార్డు సభ్యులు

TG: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో గ్రామాల్లో సందడి మొదలైంది. వికారాబాద్ జిల్లా మంతన్ గౌడ్ గ్రామంలో ఒకే ఎస్టీ కుటుంబం ఉంది. అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఉండటంతో అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్, వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు. అలాగే ఆదిలాబాద్(D) తేజాపూర్‌లో కోవ రాజేశ్వర్, సిరిసిల్ల(D) రూప్లానాయక్ తండాలో రూప్లానాయక్‌ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


