News July 21, 2024

ఖర్గే బర్త్‌డే.. విషెస్ చెప్పిన పీఎం, రాహుల్

image

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(82) పుట్టినరోజు సందర్భంగా PM మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషెస్ తెలిపారు. ‘ఖర్గేజీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సుదీర్ఘ జీవితాన్ని గడపాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌ డే ఖర్గేజీ. ప్రజలకోసం మీరు చేస్తున్న సేవ, మీ నిబద్ధత స్ఫూర్తిదాయకం. మీరు మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.

Similar News

News April 11, 2026

IPLలో నేడు డబుల్ ధమాకా

image

IPLలో ఈరోజు 3.30PMకి చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా PBKS, SRH తలపడనున్నాయి. PBKSపై SRHకు మంచి రికార్డు ఉంది. రెండు జట్ల మధ్య 24 మ్యాచులు జరగగా సన్‌రైజర్స్ 17 గెలిచింది. దీంతో ఈరోజు మరో విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 7.30PMకి చెన్నై వేదికగా CSK, DC మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడగా 19 విజయాలతో CSKదే పైచేయిగా ఉంది.

News April 11, 2026

ఎల్లుండి టెట్ నోటిఫికేషన్?

image

TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 13న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. ఇప్పుడు రెండో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశముంది.

News April 11, 2026

WTCలో మార్పులు.. ఇక నుంచి 12 జట్లు?

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పలు మార్పులు జరిగే అవకాశముంది. 2027 నుంచి మొదలయ్యే WTC సైకిల్‌లో జట్ల సంఖ్యను 9 నుంచి 12కి పెంచాలని ICC వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. కొత్తగా ZIM, IRE, AFGను చేర్చాలంది. కాగా ప్రస్తుతం కనీసం 2 మ్యాచుల సిరీస్‌ల ఫలితాలు WTC pts టేబుల్‌కి యాడ్ అవుతున్నాయి. ఇక నుంచి సింగిల్ టెస్ట్ సిరీస్‌ల ఫలితాలనూ యాడ్ చేయాలనుకుంటున్నారు. దీనిపై ICC తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.