News February 8, 2025

ఖట్టర్ ఇమాందార్.. ఇమేజ్ ఖతం!

image

లూజు ప్యాంటు. పొడవు చొక్కా. జేబులో రెనాల్డ్స్ పెన్ను. తలకు మఫ్లర్. పర్ఫెక్టుగా డిజైన్ చేసుకున్న సామాన్యుడి ఇమేజ్. ప్రజల డబ్బుకు ఖట్టర్ ఇమాందార్‌గా ఉంటానని ప్రతిజ్ఞ. అవినీతి రహిత రాజకీయాలు చేస్తానన్న హామీతో వరుసగా 3సార్లు గెలుపు. కట్‌చేస్తే శీశ్‌మహల్లో గోల్డ్ ప్లేటెడ్ కమోడ్. వేగనార్ పోయి బెంజ్ వచ్చే. లిక్కర్, వాటర్ స్కాములు. అవినీతి ఆరోపణలు. జైల్లోనూ పదవిపై వ్యామోహం. కళంకిత ఇమేజ్‌తో AKకు శరాఘాతం!

Similar News

News February 8, 2025

కేజ్రీవాల్‌పై స్వాతి కోపమే శాపమైందా?

image

ఆప్ రాజ్యసభ ఎంపీ <<15398600>>ట్వీట్‌‌తో<<>> సొంత పార్టీతో తనకు విభేదాలేంటనే చర్చ జరుగుతోంది. గతేడాది CMఆఫీస్‌లో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేశాడని స్వాతి ఆరోపించారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ చర్యలు తీసుకోకపోగా కనీసం ఖండించలేదు. దీంతో ఆప్‌కు వ్యతిరేకంగా మారారు. ఢిల్లీలోని సమస్యలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసారు, యమునా నీటిసమస్యపై కేజ్రీవాల్ ఇంటికి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగట్టారు.

News February 8, 2025

హీరోకు అరుదైన వ్యాధి.. కామెంట్స్ వైరల్

image

తాను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. దాని నుంచి కోలుకునేందుకు 7-8 ఏళ్లు పట్టినట్లు వెల్లడించారు. స్టార్ డమ్ ఎంజాయ్ చేయాల్సిన రోజుల్లో ఈ వ్యాధితో ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ఫ్యాన్స్ తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తనకు టెన్షన్ వచ్చేదని తెలిపారు. ఈ విషయమై డాక్టర్లను సంప్రదిస్తే దీని గురించి బయటపడిందన్నారు.

News February 8, 2025

ఆడపిల్ల అని చెత్తబుట్టలో పడేస్తే..!

image

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ లీసా స్తాలేకర్ గుర్తున్నారా? ఈమెది ఇండియానే. ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు చెత్తబుట్టలో పడేస్తే అనాథ శరణాలయం చేరదీసింది. ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం దత్తత తీసుకోవడంతో ఆమె న్యూసౌత్ వేల్స్‌కు వెళ్లారు. క్రికెట్‌లో అనేక సవాళ్లను ఎదుర్కొని AUS జట్టుకు కెప్టెన్‌ అయి ICC మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డునూ గెలిచారు. ఈమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఏమంటారు?

error: Content is protected !!