News January 13, 2025

నేటి నుంచి ఖో ఖో వరల్డ్ కప్

image

ఖో ఖో క్రీడా చరిత్రలోనే తొలి వరల్డ్ కప్ నేటి నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనుంది. భారత ఖోఖో సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మొత్తం 23 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. భారత పురుషుల జట్టు నేడు నేపాల్‌తో, మహిళల జట్టు రేపు ద.కొరియాతో ఆడనుంది. రాత్రి 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్, DD స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు. తెలుగు కుర్రాళ్లు శివారెడ్డి, జానకిరామ్(స్టాండ్ బై)కి జట్టులో చోటు దక్కింది.

Similar News

News January 13, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

భోగి పండగ వేళ హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.430 పెరిగి రూ.80,070 పలుకుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.73,400కు చేరింది. అటు కేజీ వెండి రూ.1,000 పెరిగి రూ.1,02,000 పలుకుతోంది.

News January 13, 2025

సంక్రాంతి: ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయంటే?

image

సంక్రాంతి పండుగ కోసం చాలా మంది హైదరాబాద్ నుంచి ఏపీకి చేరుకుంటున్నారు. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. నగరం నుంచి విజయవాడ, కర్నూలు. తమిళనాడు వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారాయి. గత 3 రోజుల్లో 11 టోల్ గేట్ల ద్వారా ఏపీ వైపు సుమారు 1,78,000 వెహికల్స్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

News January 13, 2025

నిఫ్టీ 200, సెన్సెక్స్ 700 డౌన్.. Rs3L CR లాస్

image

<<15141868>>అంచనా<<>> వేసినట్టే దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 23,217 (-213), సెన్సెక్స్ 76,707 (-675) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో పొద్దున్నే రూ.3లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.85 పాయింట్లు పెరిగి 15.94కు చేరుకుంది. ఆటో, మెటల్, ఫార్మా, ఫైనాన్స్, రియాల్టి, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు విలవిల్లాడుతున్నాయి.