News September 10, 2025

రూ.200 కోట్ల క్లబ్‌లో ‘కొత్త లోక’

image

‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణీ ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 13 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. డొమినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.

Similar News

News April 2, 2026

ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

News April 2, 2026

నాగ్.. 25 నుంచి 60ఏళ్ల వరకు!

image

తన 100వ సినిమాపై నటుడు నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీలో తాను 25 నుంచి 60ఏళ్ల వయస్సు వరకు పలు గెటప్స్‌లో కనిపించనున్నట్లు తెలిపారు. యువకుడిగా కనిపించడానికి డీ-ఏజింగ్ టెక్నిక్ వాడుతున్నామన్నారు. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ కథ ఉంటుందని వెల్లడించారు. తమిళ డైరెక్టర్ RA కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి కింగ్ 100, లాటరీ కింగ్ తదితర పేర్లు పరిశీలిస్తున్నారు.

News April 2, 2026

ఇటలీకి హ్యాట్రిక్ షాక్!

image

ఫుట్‌బాల్ ప్రపంచకప్ హిస్టరీలో నాలుగుసార్లు (1932, 1938, 1982, 2006) ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఇప్పుడు క్వాలిఫికేషన్‌కే తడబడుతోంది. 2018, 2022తో పాటు ఇప్పుడు లేటెస్ట్‌గా మరోసారి ఆ జట్టు అర్హతను సాధించలేకపోయింది. ప్రత్యర్థి బోస్నియాను తక్కువ అంచనా వేసిందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఇతర స్టార్ జట్లు చిలీ, పోలాండ్, నైజీరియా, కోస్టారికా కూడా అర్హత సాధించలేకపోయాయి. JUN 11 నుంచి WC ప్రారంభంకానుంది.