News October 19, 2024

వయనాడ్ బరిలో సినీ నటి ఖుష్బూ?

image

వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో సినీ నటి ఖుష్బూను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి ఆమె దీటైన పోటీ ఇస్తుందనే భావన ఆ పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆమెతోపాటు ఎంటీ రమేశ్, శోభా సురేంద్రన్, ఏపీ అబ్దుల్లా కుట్టి, షాన్ జార్జ్ పేర్లను కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.

Similar News

News December 5, 2025

అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

image

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.

News December 5, 2025

CM రేవంత్‌కు సోనియా అభినందన సందేశం

image

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్-2047 నాటికి రాష్ట్రం $1T ఆర్థికశక్తిగా ఎదగడంలో కీల‌కం కానుందని INC పార్ల‌మెంట‌రీ పార్టీ నేత సోనియా గాంధీ పేర్కొన్నారు. స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్నందుకు CM రేవంత్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. సీఎం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కీల‌క‌ ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగ‌మయ్యే వారికి స‌మ్మిట్ మంచి వేదిక అని తన సందేశంలో పేర్కొన్నారు.

News December 5, 2025

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. సీఎంలకు మంత్రుల ఆహ్వానం

image

TG: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వ్యాపారవేత్తలతో పాటు పలు రాష్ట్రాల CMలకూ మంత్రులు ఆహ్వానం పలుకుతున్నారు. ఇవాళ AP CM చంద్రబాబును కోమటిరెడ్డి, TN CM స్టాలిన్‌ను ఉత్తమ్, ఝార్ఖండ్ CM హేమంత్‌ను భట్టి ఆహ్వానించారు. ‘CBN సీనియర్ నాయకుడు. ఆయన సలహా తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి’ అని కోమటిరెడ్డి చెప్పారు.