News March 22, 2024

పెరగనున్న కియా కార్ల ధరలు

image

ఏప్రిల్ 1 నుంచి తమ కార్ల ధరలను 3% వరకు పెంచనున్నట్లు కియా ఇండియా ప్రకటించింది. సెల్టోస్, సొనెట్, కారెన్స్ వంటి పలు పాపులర్ మోడళ్ల ధరలను వేరియంట్ ఆధారంగా పెంచబోతున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు, సరఫరా సంబంధిత ఖర్చులు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇండియాలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి ఓవర్సీస్, డొమెస్టిక్ మార్కెట్‌లో ఈ కంపెనీ ఇప్పటివరకు 1.16 మిలియన్ కార్లను విక్రయించింది.

Similar News

News December 2, 2025

IPLకు మరో స్టార్ ప్లేయర్ దూరం!

image

ఐపీఎల్-2026కు మరో స్టార్ ప్లేయర్ దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నెలలో జరిగే మినీ వేలం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రిజిస్టర్ చేసుకోలేదని సమాచారం. గత సీజన్‌లో మ్యాక్సీ పంజాబ్ తరఫున ఆడగా తిరిగి రిటైన్ చేసుకోని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వచ్చే సీజన్ ఆడేది అనుమానమేనని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే డుప్లెసిస్, రసెల్ వంటి స్టార్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News December 2, 2025

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

image

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలుంటాయని తెలిసిందే. కానీ గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అబార్షన్ కావడం, పుట్టే బిడ్డలో మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్ అనే జన్యు సంబంధిత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందంటున్నారు. కాబట్టి వీటిని వాడేముందు వైద్యుల సలహా తప్పనిసరి అని సూచిస్తున్నారు.

News December 2, 2025

ఆ ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ

image

AP: బీఈడీ క్వాలిఫికేషన్‌తో ఎస్జీటీలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2018-23 మధ్య కాలంలో నియమితులైన వారు ఈ నెల 25 వరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఎస్జీటీ ఉద్యోగాలకు డీఈడీ చేసినవారే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేసింది.