News July 31, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి కియారా పోస్టర్ రిలీజ్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ నుంచి హీరోయిన్ కియారా అద్వానీ పోస్టర్ విడుదలైంది. ఆమె బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. శంకర్ రూపొందిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్.

Similar News

News January 25, 2026

Super 5: మీ ప్లేట్‌లో ఉండాల్సిన టాప్ వెజ్జీస్

image

ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినడం చాలా ముఖ్యం. ఈ 5 వెజ్జీస్ మీ డైట్‌లో ఉంటే అదిరిపోయే హెల్త్ మీ సొంతమని న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా అంటున్నారు. రక్తం పెరగడానికి పాలకూర (Iron), కంటి చూపు కోసం క్యారెట్ (Vitamin A), రోగనిరోధక శక్తికి రెడ్ క్యాప్సికమ్ (Vitamin C) బాగా పనిచేస్తాయి. అలాగే బీట్‌రూట్ ద్వారా Folate, అరుగుదల పెంచేందుకు కాలీఫ్లవర్ నుంచి డైటరీ ఫైబర్ అందుతాయి.

News January 25, 2026

ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ!

image

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 నుంచి 21 రోజులు సభ నిర్వహించాలని భావిస్తోంది. మార్చి రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అదే రోజు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది.

News January 25, 2026

982 మంది పోలీసులకు అవార్డులు

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విధుల్లో మెరుగైన పనితీరు కనబరిచినందుకు 982 మంది పోలీసులను ఉన్నతస్థాయి అవార్డులు వరించాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులకు గ్యాలెంటరీ, సర్వీస్ మెడల్స్, పలువురిని రాష్ట్రపతి అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. 982లో 125 గ్యాలెంటరీ, 101 ప్రెసిడెంట్, 756 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఉన్నాయి.