News February 16, 2025
OTTలోకి వచ్చేసిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
Similar News
News February 19, 2025
కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్

TG: కానిస్టేబుల్ని అంటూ ఓ వ్యక్తి పోలీస్ కమాండ్ కంట్రోల్లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.
News February 19, 2025
మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
News February 19, 2025
ALL TIME RECORD

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా ఇవాళ ఉదయం 7 గంటలకు 16,058 మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును రాష్ట్రం అధిగమించింది. దీంతో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఎంత పెరిగినా దానికి తగ్గట్లు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.